తెలంగాణలో మరో మూడు రోజులు వణుకుడే!
- దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- కుమురం భీం జిల్లాలో అత్యంత కనిష్ఠంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా కురుస్తున్న పొగమంచు
- వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి భయపడి ప్రజలకు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులకు తోడు చలిగాలులు కూడా పెరగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండడంతో సాధారణం కంటే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్ఠంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి తోడు పొగమంచు కూడా ఇక్కట్లకు గురిచేస్తోంది. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో దట్టమైన పొగమంచు కారణంగా వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.