దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ గెలవాలంటే ఆట ఒక్కటే సరిపోదట.. ఏం కావాలో చెప్పిన ద్రవిడ్

  • సఫారీ గడ్డపై అదృష్టం కూడా ఉండాలన్న చీఫ్ కోచ్
  • రెండుసార్లు విజయానికి దగ్గరగా వచ్చి సాధించలేకపోయామని ఆవేదన
  • ఈసారి అవకాశాలను అందిపుచ్చుకుంటామని ధీమా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తొలి రోజు తడబడింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబడ 5 వికెట్లు తీసుకుని భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలంటే అదృష్టం కలిసిరావాలని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలన్న 31 ఏళ్ల కలను నెరవేర్చుకునేందుకు మరింతగా శ్రమిస్తామన్నాడు.

సిరీస్ విజయానికి రెండుసార్లు దగ్గరగా వచ్చినప్పటికీ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈసారి మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టబోమని పేర్కొన్నాడు. చక్కగా బంతులు సంధించడంతోపాటు క్రీజులో పాతుకుపోయే లక్షణం ఉంటే ఇక్కడ మ్యాచ్‌లు గెలవొచ్చని ద్రవిడ్ వివరించాడు.


More Telugu News