కారులో విగతజీవిగా కనిపించిన ‘పారాసైట్’ నటుడు లీ సన్ క్యూన్
- గంజాయి, సైకోయాక్టివ్ డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు
- విచారణ తర్వాతి రోజే కారులో విగతజీవిగా కనిపించిన వైనం
- ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానాలు
‘పారాసైట్’ నటుడు లీ సన్ క్యున్ ఓ కారులో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. దక్షిణ కొరియాకు చెందిన లీ నటించిన పారాసైట్ సినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు అందుకుంది. 48 ఏళ్ల లీ రాజధాని సియోల్‌లో ఓ కారులో మృతి చెంది కనిపించినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. లీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. గంజాయి సహా సైకోయాక్టివ్ డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లీ విచారణ తర్వాతి రోజే మృతి చెంది కనిపించడం గమనార్హం. లీ కారణానికి సరైన కారణం తెలియాల్సి ఉంది.
1975లో జన్మించిన లీ మ్యూజికల్ థియేటర్ ద్వారా కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్నచిన్న వేషాలతోపాటు సహాయ నటుడి పాత్రలు పోషించాడు. 2007లో ‘కాఫీ ప్రిన్స్’ సిరీస్ ద్వారా ఒక్కసారిగా అతడి పేరు వెలుగులోకి వచ్చింది. ‘వైట్ టవర్’, ‘పాస్తా’, ‘గోల్డెన్ టైం’, ‘మై మిస్టర్’ వంటివి అతడికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. 2019లో లీ నటించిన బ్లాక్ కామెడీ మూవీ ‘పారాసైట్’కు ఆస్కార్ అవార్డు వరించింది.