సంక్రాంతి అనంతరం జిల్లాల్లో నారా లోకేశ్ పర్యటన
- ‘యువగళం’ పాదయాత్ర తరువాత మిగిలిన జిల్లాలపై దృష్టి
- జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు
- పోల్ మేనేజ్‌మెంట్‌పైనే ప్రధానంగా దృష్టి
- మంగళగరి పర్యటనతో మొదలుకానున్న కార్యక్రమం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన జిల్లాల వారీగా కార్యకర్తలతో భేటీ కానున్నారు. మొత్తం 40 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.
యువగళం పాదయాత్రతో నారా లోకేశ్ ఇప్పటివరకూ 97 నియోజకవర్గాలను సందర్శించిన విషయం తెలిసిందే. తాజా కార్యక్రమంలో మిగతా జిల్లాలపై దృష్టిపెట్టనున్నారు. ఈసారి ప్రధానంగా పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించనున్నారు. బూత్ లెవెల్, మండల స్థాయి, అనుబంధ సంస్థల కమిటీలతో సంస్థాగత వ్యవహారాలపై సమీక్షలు నిర్వహించనున్నారు.
కాగా, దాదాపు 11 నెలల విరామం తరువాత సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో లోకేశ్ తాజాగా పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.