మహిళకు వేధింపులు.. మియాపూర్ ఎస్సైపై వేటు!
- ఓ కేసులో బాధితురాలి పట్ల ఎస్సై గిరీష్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు నిర్ధారణ
- సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి
- నేరుగా సీపీకి ఫిర్యాదు చేయడంతో చర్యలు
ఓ కేసులో బాధితురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్సై గిరీష్ కుమార్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ కేసు నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన ఓ బ్యూటీషియన్ ఫోన్ నంబర్ తీసుకొని ఎస్సై ఆమె వెంటబడి, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు విచారణలో తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
కాగా వ్యాపారం పేరుతో తన స్నేహితుడు రూ.6 లక్షలు తీసుకొని మోసం చేశాడని, తిరిగి ఆ డబ్బు ఇవ్వడం లేదంటూ బాధిత బ్యూటీషియన్ మియాపూర్ ఠాణాలో చీటింగ్ కేసు పెట్టింది. నిందిత వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పించడంతో కేసు ముగిసింది. కానీ ఎస్సై గిరీష్ కుమార్ బాధిత మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటపడి వేధిస్తుండడంతో బాధిత మహిళ నేరుగా సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సైపై సస్పెన్షన్ వేటుపడింది.