తెలంగాణలో నేడు మరో ఎనిమిది కరోనా కేసుల నమోదు

  • కొవిడ్‌కు సంబంధించి బులెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ 
  • ప్రస్తుతం 59 మంది కొవిడ్ చికిత్సను పొందుతున్నట్లు వెల్లడి
  • ఈ రోజు 1,333 మందికి కరోనా పరీక్షల నిర్వహణ
గత ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో 8 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా విస్తరిస్తోంది. దేశంలో, రాష్ట్రంలో జేఎన్.1 కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్ కొత్త వేరియంట్‌కు సంబంధించి ప్రతిరోజు బులెటిన్ విడుదల చేస్తోంది. నేటి బులెటిన్ ప్రకారం... కొత్తగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 59 మంది కొవిడ్ చికిత్సను పొందుతున్నారు. ఈ రోజు 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో ముప్పై మంది నివేదికలు రావాల్సి ఉంది.

ఇక, తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు (మహమ్మారి ప్రారంభం నుంచి) కరోనా కేసుల సంఖ్య 8,44,566కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు 8,40,396 మంది కొవిడ్ నుంచి బయటపడగా... గత ఇరవై నాలుగు గంటల్లో మరో నలుగురు కోలుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా రాష్ట్రంలో 4,111 మంది మృత్యువాతపడ్డారు.


More Telugu News