కశ్మీర్ కూడా గాజా, పాలస్తీనాలా మారుతుంది: ఫరూక్ అబ్దుల్లా
- భారత్, పాకిస్థాన్ దేశాలు కశ్మీర్ పై చర్చలు జరపాలన్న అబ్దుల్లా
- చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యలు
- పాక్ నేతలు చర్చలకు ముందుకు రావాలని పిలుపు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు కశ్మీర్ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనకపోతే, కశ్మీర్ కూడా మరో గాజా, పాలస్తీనాలా తయారవుతుందని అన్నారు. కశ్మీర్ వివాదంపై భారత్, పాకిస్థాన్ చర్చలు జరపాలని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
పొరుగుదేశంతో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా... రెండు దేశాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని పేర్కొన్నారు. మనం స్నేహితులను మార్చుకోవచ్చేమో కానీ, పొరుగువారిని మార్చుకోలేమని గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారని ఫరూక్ అబ్దుల్లా వివరించారు. యుద్ధం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ కూడా అభిలషించారని తెలిపారు.
అయితే, పాకిస్థాన్ నేతలు చర్చలకు ముందుకు రావడంలేదని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని కావడం గురించి ఆలోచిస్తున్నారని, భారత్ తో చర్చలకు సిద్ధమంటున్నారే కానీ, చర్చలకు మాత్రం ముందుకు రావడంలేదని విమర్శించారు.