మూడు రోజుల పాటు తెలంగాణలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు

  • రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29.3 డిగ్రీలు
  • తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా వీస్తున్న గాలులు
  • రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందన్న అధికారులు
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రానున్న రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29.3 డిగ్రీలుగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. నేడు అత్యధికంగా ఖమ్మంలో 29.3 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా సిర్పూర్‌లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. దీంతో మరో మూడు రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రానున్న రెండు రోజుల్లో అదిలాబాద్, కుమరంభీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


More Telugu News