ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు కోసం గంటలకొద్దీ నిలబడాల్సిన అవసరం లేదు: షబ్బీర్ అలీ
- ప్రభుత్వమే దరఖాస్తులను ఇస్తుందన్న షబ్బీర్ అలీ
- ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడి
- వందమందికి ఓ కౌంటర్ ఏర్పాటు చేస్తుందన్న మాజీ మంత్రి
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కోసం ప్రజలు గంటల కొద్ది మీ సేవా కేంద్రాల్లో నిలబడాల్సిన అవసరం లేదని... కౌంటర్లు పెట్టి ప్రభుత్వమే దరఖాస్తులను ఇస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం ఆయన ఆరు గ్యారెంటీ హామీలపై మాట్లాడుతూ... వీటి కోసం దరఖాస్తులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. వంద మందికి ఓ కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మీ సేవా కేంద్రాల్లో గంటల తరబడి ప్రజలు నిలబడాల్సిన అవసరం లేదని తెలిపారు.
కేటీఆర్ స్వేదపత్రంపై విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా షబ్బీర్ అలీ బీఆర్ఎస్ స్వేదపత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారుల నుంచి వివరాలు సేకరించి శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. అలా ప్రభుత్వం విడుదల చేసిన దానిలో తప్పులు ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో తప్పులు ఏమున్నాయో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. స్వేదపత్రం పేరుతో కేటీఆర్ పిల్ల చేష్టలు చేశాడని ఎద్దేవా చేశారు.