కేటీఆర్ స్వేదపత్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- స్వేదపత్రంపై చర్చకు కేటీఆర్ సిద్ధమేనా? అని పొన్నం సవాల్
- కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిందని వెల్లడి
- బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలన్న పొన్నం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రంపై చర్చకు రావడానికి కేటీఆర్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. మంగళవారం పొన్నం మాట్లాడుతూ... కేటీఆర్ విడుదల చేసింది స్వేదపత్రంకాదని.. అది తెలంగాణ ప్రజల చెమటతో కూడిన పత్రమని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్వేతసౌధాల వివరాలు బయటపెట్టాలని... దమ్ముంటే వారి భవనాలు.. భూముల లెక్కలపై శ్వేతపత్రం ఇవ్వాలన్నారు.
తాము తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. తెలంగాణ రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ ప్రారంభంలో ధనిక రాష్ట్రమని చెప్పిన బీఆర్ఎస్ నేతలు... ప్రభుత్వ ఆస్తులు ఎందుకు అమ్మివేశారో చెప్పాలని నిలదీశారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎలా పెరిగాయి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు చెప్పిందే నిజమైతే శాసనసభలోనే చర్చ జరపాల్సిందన్నారు.