పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి సంబంధించిన జీవో విడుదల
- ఆయా వాహనాలపై 60 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ కల్పిస్తూ జీవో విడుదల
- బైక్‌లు, ఆటోలపై 80 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం, కార్లు, హెవీ వెహికిల్స్‌పై 60 శాతం రాయితీ
- నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు అమలులో రాయితీ
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం జీవోను జారీ చేసింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఆయా వాహనాలపై 60 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీని కల్పిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు జీవో విడుదలైంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై 80 శాతం, ఆర్టీసీ బస్సులపై 90 శాతం, కార్లు, హెవీ వెహికిల్స్‌పై 60 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రాయితీ మంగళవారం (డిసెంబర్ 26, 2023) నుంచి 10 జనవరి 2024 వరకు అమలులో ఉండనుంది. ఈ రాయితీతో వాహనదారులు పెద్ద ఎత్తున తమ పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.