ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ

  • పారిశ్రామిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి
  • పరిశ్రమలకు సులభంగా అనుమతులు ఇస్తామని వెల్లడి
  • రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్న సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై వారు చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. పరిశ్రమలకు సులభంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్నారు.

ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామన్నారు.


More Telugu News