ఇండస్ట్రీలో తెలిసినవాళ్లెవరూ లేరు .. కానీ అలా ప్రచారం చేస్తున్నారు: 'సలార్' చైల్డ్ ఆర్టిస్ట్
- చిన్నప్పటి వరదరాజ పాత్రలో కార్తికేయ దేవ్
- తనకి సినిమాలంటే ఇష్టమని వెల్లడి
- ప్రభాస్ ను కలవలేకపోవడం బాధగా ఉందన్న దేవ్
- తాను రవితేజకి బంధువుననే మాటలో నిజం లేదని వ్యాఖ్య
'సలార్' సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి పాత్రను కార్తికేయ దేవ్ పోషించాడు. వరదరాజ పాత్ర ఆ కుర్రాడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా 'మన మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ దేవ్ మాట్లాడుతూ ... "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టం. బాగానే చదువుకునేవాడిని కానీ, సినిమాలు ఎక్కువగా చూసేవాడిని" అని అన్నాడు.
"ప్రస్తుతం నేను టెంత్ క్లాస్ చదువుతున్నాను. నేను 'సలార్' సినిమాలో యాక్ట్ చేశానంటే మా స్కూల్లో చాలామంది నమ్మలేదు. ఇప్పుడు వాళ్లంతా కూడా 'భలేగా చేశావురా' అని అంటున్నారు. ఫస్టు సీన్ చేసేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. బాగా చేయలేదని మాత్రం ప్రశాంత్ నీల్ సార్ అనరు. ఇంకా బాగా చేయాలి అని ఎంకరేజ్ చేస్తారు" అని చెప్పాడు.
" ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు. కానీ కొంతమంది నేను రవితేజగారి కజిన్ బ్రదర్ కొడుకుననీ, రవితేజగారి సపోర్టుతో వచ్చానని రాస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా సమయంలో నేను ప్రభాస్ గారిని కలవలేకపోయాననే బాధ నాకు ఉంది. త్వరలో కలుస్తాననే నమ్మకం ఉంది" అని అన్నాడు.