'దేవర' ఓ విజువల్ వండర్: హీరో కల్యాణ్ రామ్
- 'దేవర' గురించి ప్రస్తావించిన కల్యాణ్ రామ్
- 80 శాతం షూటింగు పూర్తయిందని వెల్లడి
- విదేశీ నిపుణులు పనిచేస్తున్నారని వివరణ
- పార్టు 2 ఆలోచన అప్పుడే వచ్చిందని వ్యాఖ్య
కల్యాణ్ రామ్ హీరోగా 'డెవిల్' సినిమా రూపొందింది. శ్రీకాంత్ విస్సా అందించిన కథ ఇది. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి, నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కల్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు.
తాజాగా గ్రేట్ ఆంధ్రకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ కి 'దేవర' సినిమా గురించిన ప్రశ్న ఎదురైంది. ఆ సినిమాకి ఆయన ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అందుకు కల్యాణ్ రామ్ స్పందిస్తూ ... 'దేవర' మొదటి భాగానికి సంబంధించి 80 శాతం షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి ముందుగా చెప్పుకోవలసి వస్తే విజువల్స్ గురించే చెప్పుకోవాలి" అన్నాడు.
"నాకు తెలిసి తెలుగులో అలాంటి విజువల్స్ ను చూడలేదు. అలాంటి విజువల్స్ తెరపై కనిపించడం కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. తమ్ముడు ఎంతో తపనపడ్డాడు. సెట్స్ కోసం .. ఫైట్స్ కోసం విదేశాలకి చెందిన నిపుణులను రంగంలోకి దింపడం జరిగింది. ఇది ఎంతో కష్టంతో .. ఖర్చుతో కూడుకున్న పని. సెట్లోకి అడుగుపెట్టిన నాకు అదో ప్రత్యేకమైన ప్రపంచంలా అనిపించింది. ఈ సినిమా షూటింగును మొదలుపెట్టిన తరువాతనే పార్టు 2 ఆలోచన వచ్చింది" అని చెప్పాడు.