వెంకటేశ్ 75 సినిమాల జర్నీ నేపథ్యంలో .. వెంకీ 75 సెలబ్రేషన్స్!
- 'కలియుగ పాండవులు'తో ఎంట్రీ ఇచ్చిన వెంకీ
- ఆ తరువాత వరుస సినిమాలు .. భారీ విజయాలు
- తనదైన స్టైల్ తో మెప్పిస్తూ వస్తున్న వెంకీ
- 75వ సినిమాగా రానున్న 'సైంధవ్'
వెంకటేశ్ 1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. 'ప్రేమ' సినిమాతో యూత్ కి మరింత చేరువైన వెంకీ, 'శ్రీనివాస కల్యాణం' .. 'స్వర్ణకమలం' సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. ఇక 90లలో వచ్చిన 'బొబ్బిలి రాజా' .. 'శత్రువు' .. 'కూలీ నెం.1' సినిమాలు ఆయనను తిరుగులేని స్టార్ ను చేశాయి.
వెంకటేశ్ తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకున్నారు. తనదైన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీతో అభిమానులను పెంచుకున్నారు. ఇక కామెడీ చేయడమనేది ఫైట్స్ చేసినంత తేలిక కాదు. అలాంటి కామెడీని అవలీలగా పండించడం వెంకటేశ్ ప్రత్యేకతగా మారింది. ఒకానొక దశలో ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అలాంటి వెంకటేశ్ నుంచి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సైంధవ్' రెడీ అవుతోంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 75వ సినిమా. ఈ నేపథ్యంలో ఆయన 75 సినిమాల జర్నీకి సంబంధించి, హైదరాబాదు .. జేఆర్సీ కన్వెన్షన్ లో ఒక ఈవెంటును ప్లాన్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.