కొవిడ్ కొత్త వేరియంట్‌పై కిషన్ రెడ్డి హెచ్చరికలు
- కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కేసుల సంఖ్య పెరుగుతోందన్న కిషన్ రెడ్డి
- అవసరమైతే కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తామని వెల్లడి
- ప్రమాదం కాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారన్న కిషన్ రెడ్డి
- అయినా కొవిడ్ కట్టడికి ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన తిలక్ నగర్‌లోని ఫీవర్ ఆసుపత్రికి వెళ్లి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా మహమ్మారిపై రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
అవసరమైతే కొవిడ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి వేగంగా ఉంటోందన్నారు. అయితే ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారని తెలిపారు. కొవిడ్ కట్టడికి ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించామన్నారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.