ఓటమితో కుంగిపోవద్దు... ఓడిపోయినవారే అసెంబ్లీ ఇంఛార్జ్‌లు: కేటీఆర్
- లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన కేటీఆర్
- అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచన
- జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలన్న కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏమాత్రం కుంగిపోవద్దని... ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంఛార్జులని... తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కేడర్‌కు సూచించారు. సోమవారం ఆయన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎంపీ రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని, పార్టీని బలోపేతం చేయాలన్నారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలన్నారు.
సమావేశం అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... తనను చేవెళ్ల ఎంపీగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశనం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున ఇక బీఆర్ఎస్ ఖాళీ అవుతోందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, దీనిని తిప్పికొట్టాలని సూచించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.