నెలల పసికందుపై కుక్కల దాడి.. హైదరాబాద్ లో దారుణం
- ఈ నెల 8న ఘటన.. ఆసుపత్రిలో 17 రోజుల చికిత్స
- సోమవారం ఉదయం కన్నుమూసిన పసికందు
- కన్నీటిపర్యంతం అవుతున్న తల్లిదండ్రులు
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో మరో పసికందు ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాబును కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. నగరంలోని షేక్ పేటలో చోటుచేసుకుందీ విషాదం.
షేక్ పేటలోని ఓ గుడిసెలో ఉంటున్న అనూష, అంజి దంపతులకు 5 నెలల కొడుకు శరత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 8న శరత్ ను ఊయలలో పడుకోబెట్టి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చాక బాబు గాయాలపాలై ఏడుస్తూ కనిపించాడు. దీంతో హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు నీలోఫర్ కు తీసుకెళ్లాలని సూచించారు.
ఆపై నీలోఫర్ నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలుడిని కాపాడేందుకు వైద్యులు 17 రోజుల పాటు శ్రమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం శరత్ కన్నుమూశాడు. దీంతో అనూష, అంజి కన్నీరుమున్నీరవుతున్నారు.