తెలంగాణలో ఏడుగురు సీనియర్ అధికారుల బదిలీ
- తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటు
- తాజాగా ఆరుగురు ఐఏఎస్ లు, ఒక ఐపీఎస్ బదిలీ
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం కలుగుతోంది. తాజాగా ఏడుగురు సీనియర్ అధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ లు కాగా, ఒకరు ఐపీఎస్ అధికారి.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న భారతి హోలికెరిని జీఏడీకి బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పొత్రును నియమించారు.
ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఈవీ నరసింహారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా డీఎస్ చౌహాన్, రవాణా శాఖ కమిషనర్ గా జ్యోతి బుద్ధప్రకాశ్ ను నియమించారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ గా ఇ.శ్రీధర్ ను నియమించారు. ఆయనకు టీఎస్ఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు.
ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతికుమారి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.