ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రైల్వే అలర్ట్

  • ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే వెల్లడి
  • సహకరించాలంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి
  • మొత్తం 29 లోకల్ సర్వీసులను ఆపేసినట్లు వివరణ
హైదరాబాద్ లో వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషనల్ కారణాలతో మొత్తం 29 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలంటూ విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్, లింగంపల్లి, ఉందానగర్, ఫలక్ నుమా మార్గాల్లో నడిచే మొత్తం 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. వీటితో పాటు రామచంద్రాపురం - ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి తదితర సర్వీసులను కూడా ఆపేస్తున్నట్లు వివరించింది.

రద్దు చేసిన పలు రైళ్ల వివరాలు..
లింగంపల్లి - ఉందానగర్‌ (47213),
ఉందానగర్‌ - లింగంపల్లి (47211),
ఉందానగర్‌ - సికింద్రాబాద్‌ (47246),
ఉందానగర్‌ - సికింద్రాబాద్‌ (47248),
లింగంపల్లి - ఉందానగర్‌ (47212),
సికింద్రాబాద్‌ - ఉందానగర్‌ (47247),
ఉందానగర్‌ - సికింద్రాబాద్‌ (47248),
సికింద్రాబాద్‌ - ఉందానగర్‌ (47249),
ఉందానగర్‌ - లింగంపల్లి (47160),
లింగంపల్లి - ఫలక్‌నుమా (47188),
ఫలక్‌నుమా - లింగంపల్లి (47167),
లింగంపల్లి - ఉందానగర్‌ (47194),
లింగంపల్లి - ఉందానగర్‌ (47173) రైళ్లతో సహా 29 రైళ్లను రద్దు చేసింది.



More Telugu News