మంత్రి అంబటి వ్యాఖ్యలకు బొండా ఉమ కౌంటర్
- లోకేశ్ తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిశోర్
- ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం
- మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేస్తాడంటూ అంబటి సెటైర్
- మీ పని అయిపోయింది కాబట్టే గెలిచే టీడీపీని కలిశాడంటూ బొండా ఉమ రిప్లయ్
ఏపీ రాజకీయాలు నేడు కీలక మలుపు తిరిగాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటివరకు వైసీపీ పక్షం అని భావించిన వారికి, నేడు చోటు చేసుకున్న పరిణామం అమితాశ్చర్యాన్ని కలిగించింది. హైదరాబాదు నుంచి నారా లోకేశ్ తో కలిసి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిశోర్... ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. దాదాపు 3 గంటల పాటు సమావేశమై చంద్రబాబుకు ఓ నివేదిక అందించారు.
కాగా, లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ ఏపీకి రావడంపై మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించడం తెలిసిందే. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడని సెటైర్ వేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ స్పందించారు. "బాగా చెప్పావు అంబటి... వైసీపీ పని, మీ జగన్ పని అయిపోయింది కాబట్టే గెలిచే టీడీపీని కలిశాడు" అంటూ ట్వీట్ చేశారు.