జీవో 46 కారణంగా నష్టపోయామంటూ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
- ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- గత ప్రభుత్వం తప్పిదాన్ని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్
- జీవో 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
జీవో నెంబర్ 46 కారణంగా తాము నష్టపోయామంటూ పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు శనివారం ఆందోళన చేపట్టారు. వారంతా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సరిదిద్దాలని... తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 46పై గత ప్రభుత్వంలోని హోంమంత్రికి అవగాహన లేకపోవడం, బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తప్పిదం కారణంగా ఎంతోమంది అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే తక్షణమే ఆ జీవోను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ జీవో వల్ల తెలంగాణలోని యువకులు స్థానికేతరులుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఓయూ జేఏసీ చైర్మన్ రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.