రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రావడం సంతోషం కలిగించింది: రఘురామ
- నేడు వైకుంఠ ఏకాదశి
- కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేసిన రఘురామ
- వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నానని వెల్లడి
ఇవాళ ముక్కోటి ఏకాదశి. ఈ నేపథ్యంలో, నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు నేడు తిరుమల విచ్చేశారు. తన పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు.
"వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ కుటుంబ సమేతంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. అనంతరం వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకున్నాను. సుమారు రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా, అందరికీ శుభం జరగాలని, రాష్ట్ర ప్రజల కోరికలు నెరవేరాలని స్వామివారిని కోరుకున్నాను... ఓం నమో వేంకటేశాయ" అని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన రఘురామకృష్ణరాజు... ఎన్నికల్లో గెలిచాక, వైసీపీ నాయకత్వంతో విభేదాలు మొదలయ్యాయి.. అక్కడ్నించి వివిధ పరిణామాల కారణంగా రాష్ట్రానికి రాలేని పరిస్థితులు నెలకొనడంతో, ఆయన తన నియోజకవర్గానికి దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా ఢిల్లీ, హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.