తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- శుభాకాంక్షలు తెలిపిన ఏసీబీ కార్యాలయ సిబ్బంది.. ఇతర ఉద్యోగులు
- రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని చేసినట్లు చెప్పిన సీవీ ఆనంద్
- శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచానని వెల్లడి
తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని చేసిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏసీబీ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.
రెండేళ్లపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా తాను కొనసాగానని ఆయన పేర్కొన్నారు.
శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ... ఎక్కడా మతసామరస్యం దెబ్బతినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్‌లో గతంలో ఎన్నడూ చూడని నేరాలను చూసినట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.