గత నంది అవార్డుల్లో నాకు అన్యాయం జరిగింది.. నాకు కనీసం 15 అవార్డులు రావాలి: పోసాని కృష్ణమురళి

  • టీడీపీ ప్రభుత్వంలో అనర్హులకే నంది అవార్డులు దక్కాయన్న పోసాని
  • ఈసారి ఒక్క అనర్హుడికి కూడా అవార్డు రాదని వ్యాఖ్య
  • వైసీపీ ప్రభుత్వం కళాకారులను గౌరవిస్తుందన్న పోసాని
టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకే నంది అవార్డులు దక్కాయని సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. నంది అవార్డుల్లో తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పారు. ఆర్టిస్టుగా, డైరెక్టర్ గా, రైటర్ గా తనకు కనీసం 15 నందులు రావాలని అన్నారు. ఒక నంది వచ్చింది కానీ, ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని, తనను నమ్మాలని... ఈ సారి ఒక్క అనర్హుడికి కూడా నంది రాదని అన్నారు. అత్యంత పారదర్శకతతో నంది అవార్డులను ఇస్తామని చెప్పారు. అర్హులకే అవార్డులు వస్తాయని తెలిపారు. కళాకారులను గౌరవించే ప్రభుత్వం తమ వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News