సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నన్ను వెయ్యి కోట్లు అడిగారు: కేఏ పాల్
- విశాఖలో తనకు మద్దతిస్తానని గతంలో లక్ష్మీనారాయణ చెప్పారన్న పాల్
- అకౌంట్లో వెయ్యి కోట్లు చూపించాలని అడిగారన్న పాల్
- అమీర్ పేట కార్యాలయంలో ఇది జరిగిందని వెల్లడి
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. విశాఖలో ఎంపీగా నిలబడనని, తనకు మద్దతిస్తానని గతంలో లక్ష్మీనారాయణ చెప్పారని... తనను నిలబెట్టి, గెలిపిస్తానని ఆయన చెప్పారని తెలిపారు. తనను వెయ్యి కోట్లు అడిగారని, అకౌంట్లో డబ్బు చూపించమన్నారని, లేకపోతే పార్టీ పెడతానని అన్నారని చెప్పారు.
రెండు నెలల క్రితం అమీర్ పేటలోని తమ కార్యాలయంలో ఇది జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆయనకు వెయ్యి కోట్లు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్సే వెయ్యి కోట్లు ఇచ్చుంటుందని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ గెలవకుండా, ఓట్లు చీల్చడానికి లక్ష్మీనారాయణతో పార్టీ పెట్టిస్తున్నారని విన్నానని చెప్పారు.