పఠాన్, జవాన్, యానిమల్ సినిమాల రికార్డులను బద్దలుగొట్టిన సలార్
- తొలిరోజు వసూళ్లలో సలార్ ప్రభంజనం
- దేశీయంగా రూ. 95 కోట్ల తొలి రోజు వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 70 కోట్ల వసూలు
- కేరళలో రూ. 5 కోట్లు, కర్ణాటకలో రూ. 12 కోట్లు రాబట్టిన ప్రభాస్ సినిమా
దర్శకుడు ప్రశాంత్ నీల్, టాలీవుడ్ అగ్రనటుడు ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్: పార్ట్ వన్-సీస్‌ఫైర్’ సినిమా బాక్సాఫీసులను దున్నేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక, ఇండియాలో తొలిరోజు కలెక్షన్లలో రికార్డుల మోత మోగించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ సినిమాలు పఠాన్, జవాన్‌తోపాటు రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమా రికార్డులను బద్దలుగొట్టింది. ఇండియాలో తొలిరోజు రూ. 95 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకంగా రూ. 70 కోట్లు వసూలు చేసిందీ సినిమా. ఆక్యుపెన్సీ అయితే ఏకంగా 88.93 శాతంగా ఉండడం గమనార్హం. కర్ణాటక, కేరళలో వరుసగా రూ.12 కోట్లు, రూ. 5 కోట్లు వసూలు చేసింది. పఠాన్ దేశంలో తొలి రోజు రూ. 57 కోట్లు సాధించగా, జవాన్ రూ. 75 కోట్లు, యానిమల్ రూ. 63 కోట్లు సాధించింది. ఇప్పుడీ రికార్డులన్నింటినీ సలార్ అధిగమించింది.