ఆడవారి కన్నీటికీ పవర్.. వాసన చూస్తే గాలి తీసిన బెలూన్‌లా మగాడు!
- స్త్రీల కన్నీటికి మగాడి దూకుడును తగ్గించే పవర్
- శాంతి స్వభావులుగా మారిపోతారట
- పురుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న స్తీల కళ్లలోని రసాయనాలు
- వెల్లడించిన ఇజ్రాయెల్ పరిశోధకుల అధ్యయనం
ఆడవారిని చూస్తే కైపెక్కిపోయే మగవారు ఉండడం సహజ విషయమే అయినా వారి కన్నీటికి అంతకుమించిన శక్తి ఉందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు స్త్రీల కన్నీటి వాసన, అది చూపించే ప్రభావంపై జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
ఆడవారి కన్నీటి వాసన మగాడి దూకుడును నిలువరిస్తుందట. వారి కన్నీటిలోని రసాయనాలు పురుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధ్యయనంలో తేలింది. స్త్రీల కన్నీటి వాసన ఎంతటి దూకుడుమీదున్న మగాడినైనా గాలి తీసిన బెలూన్‌లా మార్చేసి శాంతిస్వరూపులుగా చేస్తుందని అధ్యయనకారుల తెలిపారు. వారి కన్నీటి వాసన మగవాళ్లలో దూకుడు స్వభావాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు ‘ప్లాస్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.