కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత
- విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక సర్కారు
- మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చన్న సీఎం సిద్ధరామయ్య
- హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్
కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం విధించిన హిజాబ్‌పై నిషేధాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఎత్తివేసింది. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు? ఏం తింటారు? అనేవి వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు.
కాగా, గత ప్రభుత్వం విధించిన హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, హిజాబ్ తప్పనిసరి అన్న నిబంధన ఇస్లాంలో లేదంటూ కర్ణాటక హైకోర్టు హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించింది. విద్యాసంస్థల్లో అందరికీ ఒకేరకమైన వస్త్రధారణ ఉండాలని పేర్కొంది. ఈ అంశంపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.