తెలంగాణలో కరోనా కలకలం... కొత్తగా తొమ్మిది కేసుల నమోదు

  • ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 కేసులు... ఒకరి రికవరీ
  • తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతం
  • రెండు నెలల చిన్నారికి కరోనా... వెంటి లేటర్‌పై చికిత్స
తెలంగాణ‌లో క‌రోనా భయాలు పెరుగుతున్నాయి. కొత్త కొవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన ఇరవై నాలగు గంట‌ల్లో కొత్త‌గా తొమ్మిది క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 27 క‌రోనా కేసులు న‌మోదు కాగా, ఒక‌రు రిక‌వ‌ర్ అయ్యారు. తాజాగా న‌మోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైద‌రాబాద్, ఒక‌రు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫ‌ర్‌లో రెండు నెల‌ల చిన్నారికి క‌రోనా నిర్ధార‌ణ కాగా, ఆ పాప‌కు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పదేళ్ల లోపు చిన్నారులు... అరవై ఏళ్ల పైబడిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య అధికారులు సూచించారు. వీరు తమ నివాసాల నుంచి అనవసరంగా బ‌య‌ట‌కు రాకూడద‌ని తెలిపింది. బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌ని వైద్యులు సూచించారు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు కనిపిస్తే త‌క్ష‌ణ‌మే కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని సూచించింది.


More Telugu News