ప్రస్తుత ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడూ నాకు గౌరవం ఇవ్వలేదు: రసమయి బాలకిషన్

  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై రసమయి ఆగ్రహం
  • మొన్న జరిగిన ఎన్నికల్లో దొంగమాటలు చెప్పి కవ్వంపల్లి గెలిచారని ఆరోపణ
  • ఎమ్మెల్యే మాట తీరు మార్చుకోవాలని సూచన
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రస్తుత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏనాడూ తనకు గౌరవం ఇవ్వలేదని, ప్రతిరోజు తనను వాడు... వీడు అని అసభ్యపదజాలంతో దూషణలకు దిగాడని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ విమర్శించారు. శుక్రవారం తిమ్మాపూర్‌లోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్‌లో.. మానకొండూర్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ... మొన్న జరిగిన ఎన్నికల్లో దొంగమాటలు చెప్పి కవ్వంపల్లి గెలిచారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కవ్వంపల్లి బ్రోథల్ హౌస్ నడిపి డబ్బులు సంపాదించారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన మాట తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే తానూ ఆయన దారిలోకే రావాల్సి ఉంటుందన్నారు. ఇకపై ఆయన ఏమి మాట్లాడితే తానూ అవే మాట్లాడుతానని స్పష్టం చేశారు.


More Telugu News