మళ్లీ కరోనా కలకలం... సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్

  • గత 24 గంటల్లో దేశంలో 328 కొత్త కేసులు
  • ఏపీలోనూ 3 పాజిటివ్ కేసులు
  • భారత్ లో కొత్తగా జేఎన్1 వేరియంట్
  • అధికారులతో చర్చించిన సీఎం జగన్
  • ఇదేమంత ప్రమాదకరం కాదన్న అధికారులు
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తాలూకు ప్రకంపనలు వినిపిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ 3 పాజిటివ్ కేసులు గుర్తించారు. 

దేశంలో ప్రస్తుతం వ్యాప్తిస్తున్న వేరియంట్ జేఎన్1 అని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలో మళ్లీ కరోనా ఘంటికలు మోగుతుండడం పట్ల అధికారులతో చర్చించారు. జేఎన్1 కరోనా వేరియంట్ ప్రమాదకరం కాదని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. 

ఈ వేరియంట్ తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడంలేదని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వారు వివరించారు. జేఎన్1 లో డెల్టా వేరియంట్ లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే, జేఎన్1 వేరియంట్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందని తెలిపారు.


More Telugu News