బిగ్ బాస్ ఫినాలే రోజున ఘర్షణకు విజేత పల్లవి ప్రశాంతే కారణం: డీసీపీ

  • బిగ్ బాస్ ఫినాలే ముగిశాక జరిగిన ఘర్షణలో ఆరు బస్సులు, పోలీసుల వాహనాలు దెబ్బతిన్నాయన్న డీసీపీ
  • పోలీసులకూ గాయాలైనట్లు తెలిపిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్
  • ఘర్షణ జరిగిన రోజున అక్కడి నుంచి వెళ్లిపోవాలని పల్లవి ప్రశాంత్‌కు చెబితే మళ్లీ వెనక్కి వచ్చారన్న డీసీపీ
బిగ్ బాస్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో టీఎస్ఆర్టీసీకి చెందిన ఆరు బస్సులు, కొన్ని పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకూ గాయాలైనట్లు వెల్లడించారు. బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్, అంతకుముందు జరిగిన పరిణామాలపై డీసీపీ విజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, పల్లవి ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానులు హంగామా సృష్టించారన్నారు.

అక్కడి నుంచి వెళ్లిపోవాలని పల్లవి ప్రశాంత్‌కు పోలీసులు సూచించారని, కానీ అతను ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చారన్నారు. ఎక్కువమంది గుమికూడటానికి... ఘర్షణ తలెత్తడానికి అతడే కారణమని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు కాగా, తొలి కేసులో ప్రశాంత్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు. రెండో కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.


More Telugu News