'గోకుల్ చాట్' యజమాని ముకుంద్ దాస్ మృతి

  • కోఠిలో 1996లో ప్రారంభమైన గోకుల్ చాట్ భాండార్
  • 2007 ఆగస్టు 25న జరిగిన బాంబు పేలుడులో 33 మంది మృతి
  • చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసిన ముకుంద్ దాస్
హైదరాబాద్‌లో ‘గోకుల్ చాట్’ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! కోఠి సందర్శించిన వారు ఇక్కడ చాట్ తినకుండా వెళ్లలేరు. అంతగా ఫేమస్ అయిన ఈ గోకుల్ చాట్ పేరు 2007లో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. కారణం అక్కడ జరిగిన బాంబుదాడే. ఆ ఏడాది ఆగస్టు 25న ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. చాట్ తింటూ ముచ్చట్లాడుకుంటున్న 33 మంది ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో స్నేహితులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. 

తాజాగా, గోకుల్ చాట్ పేరు మరోమారు వార్తల్లోకి ఎక్కింది. దాని యజమాని ముకుంద్ దాస్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోకుల్‌ చాట్‌ను ఆయన 1996లో ప్రారంభించారు.


More Telugu News