తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

  • ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 
  • ఆరు రోజుల పాటు... 26 గంటల 33 నిమిషాల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు
  • సెంబ్లీలో పందొమ్మిది మంది సభ్యులు ప్రసంగాలు చేసినట్లు వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెలవులు పోనూ సమావేశాలు ఆరు రోజుల పాటు సాగాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఆరు రోజులు... 26 గంటల 33 నిమిషాల పాటు జరిగాయి. అసెంబ్లీలో పందొమ్మిది మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. ఈ స‌భ‌లో రెండు అంశాల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌లు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 21వ తేదీ నాటికి స‌భ‌లో కాంగ్రెస్‌కు 64, బీఆర్ఎస్‌కు 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7, సీపీఐ త‌ర‌పున ఒక ఎమ్మెల్యే ఉన్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిర్వ‌హించిన తొలి శాస‌న‌స‌భ స‌మావేశం ఇది.


More Telugu News