దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
- ప్రస్తుత క్యాలెండర్ ఏడాది 2023లో వన్డే ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రాహుల్
- 14 ఏళ్ల తర్వాత ఈ రికార్డు సాధించిన రెండవ భారత వికెట్ కీపర్‌గా నిలిచిన స్టార్ బ్యాట్స్‌మెన్
- ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డేలో ఫీట్ సాధించిన కేఎల్
చక్కటి ఫామ్‌లో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలనం సృష్టించాడు. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవ వన్డే మ్యాచ్‌లో 21 పరుగులు చేసి ఔట్ అయిన ఈ వికెట్ కీపర్ ప్రస్తుత క్యాలెండర్ ఏడాది 2023లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000 పరుగులు సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా రాహుల్ నిలిచాడు. ఇతడి కంటే ముందు టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ పేరిట ఈ రికార్డు ఉంది. వన్డేల్లో ఒక ఏడాది వెయ్యి వన్డే పరుగులు సాధించిన తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా మహీ రికార్డు సృష్టించాడు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీట్ సాధించిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కావడం విశేషం. కాగా పార్ల్ వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డేలో ఈ రికార్డును అందుకున్నాడు.