రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య.. సభ హుందాతనం కాపాడాలని పోచారం సూచన
- అసెంబ్లీలో విద్యుత్‌పై స్వల్పకాలిక చర్చ
- సభలో ఖబడ్దార్ అన్న రాజగోపాల్ రెడ్డి
- రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరిన జగదీశ్ రెడ్డి
- వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని సూచించిన పోచారం
అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... సభ హుందాతనం కాపాడాలని ఇరుపక్షాలకు సూచించారు. సీనియర్ సభ్యుల నుంచి కొత్త సభ్యులు నేర్చుకోవాలన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని, మేము... వాళ్లు.. ఎవరూ వ్యక్తిగత దూషణలకు దిగవద్దన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందిస్తూ... ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని, తప్పు చేయకున్నా కొన్నిసార్లు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.
కాగా అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ సందర్భంలో ఖబడ్దార్ అన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగదీశ్ రెడ్డి కోరారు. ఈ సమయంలో సభాపతి ప్రసాద్ కుమార్ కల్పించుకొని... వ్యక్తిగత దూషణలకు దిగవద్దని, సభా మర్యాదలు కాపాడాలని కోరారు.
దీంతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఇదే సభలో ఎర్రబెల్లి దయాకర రావు ఉరికించి కొడతానని వ్యాఖ్యలు చేశారని, అప్పుడు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంస్కారం ఎటు పోయింది? అని ప్రశ్నించారు. మా నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడానికి మీరే కారణమన్నారు. తొందరపడకండి... పది రోజులే అయింది.. కాస్త ఓపిక పట్టండి అని వ్యాఖ్యానించారు.