నా ఫేవరేట్ సింగర్ బాలూగారే ... కానీ ఉదిత్ నారాయణ్ తో ఎందుకు పాడించానంటే..: మణిశర్మ

  • స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ 
  • 'చుడాలని ఉంది' పాటల ప్రస్తావన 
  • ఆ పాటకి హరిహరన్ కష్టపడ్డారని వివరణ 
  • కొత్తదనం కోసమే ఉదిత్ కి ఛాన్స్ ఇచ్చానని వెల్లడి

మణిశర్మ .. తెలుగు సినిమా పాటను పరిగెత్తించిన సంగీత దర్శకుడు. ఆయన బీట్స్ ఇటు యూత్ ను .. అటు మాస్ ను ఊపేస్తూ ఉంటాయి. ఈ జనరేషన్ లో తమన్ - దేవిశ్రీ ప్రసాద్ వంటి వారి నుంచి గట్టిపోటీని తట్టుకుని నిలబడినవారాయన. అలాంటి ఆయన తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

'చూడాలని వుంది' సినిమాలోని పాటలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'యమహా నగరి' పాటను పాడటానికి హరిహరన్ గారు చాలా కష్టపడ్డారు. ఆయనకి తెలుగు తెలియదు. ఒక్కో పదాన్ని పేరుస్తూ ఆయనకి నేర్పిస్తూ వెళ్లవలసి వచ్చింది. అలా నాలుగు రోజుల తరువాత ఆయనతో ఆ పాటను పాడించాము. ఆ పాట ఆయనకి స్టేట్ అవార్డును తెచ్చిపెట్టింది" అన్నారు. 

'బెంగాలీ ఫ్లేవర్ ఉండేలా 'రామ్మా చిలకమ్మా' అనే పాటను ట్యూన్ చేశాను. అందుకోసం బెంగాలీ పాటలను వినవలసి వచ్చింది. నిజానికి నా ఫేవరేట్ సింగర్ బాలూగారే. అయినా ఈ పాటను మాత్రం ఉదిత్ నారాయణ్ పాడితేనే బాగుంటుందని భావించి, ఆయనతో పాడించడం జరిగింది. శంకర్ మహదేవన్ తో ఒక పాట పాడించాను. మిగతావి బాలూగారే పాడారు" అని చెప్పారు. 



More Telugu News