తెలంగాణలో సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరణ

  • లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ 
  • దేశంలో మొత్తం 10 రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరించుకున్నాయని వెల్లడి
  • దక్షిణాదిన కేరళ, తమిళనాడు ప్రభుత్వాలూ అనుమతులు వెనక్కు తీసుకున్న వైనం
దేశంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతులు ఉపసంహరించుకున్న 10 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పంజాబ్, ఝార్ఖండ్, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మేఘాలయ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయని వెల్లడించారు.


More Telugu News