తెలుగు రచయిత పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన
- పతంజలి శాస్త్రి రచించిన 'రామేశ్వరం కాకులు...' కథా సంకలనానికి అవార్డు
- జాతీయ స్థాయిలో 24 మందికి అవార్డులు
సుప్రసిద్ధ కథా రచయిత తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. పతంజలి శాస్త్రి రచించిన 'రామేశ్వరం కాకులు... మరికొన్ని కథలు' అనే రచనకు ఈ పురస్కారం ప్రకటించారు. పతంజలి శాస్త్రి రాసిన పలు కథలను 'రామేశ్వరం కాకులు... మరికొన్ని కథలు' పేరిట సంకలనంగా తీసుకువచ్చారు. ఈ చిన్న కథల సంకలనం విశేష ప్రాచుర్యం పొందింది. పతంజలి శాస్త్రి స్వస్థలం పిఠాపురం. ఆయన 1945లో జన్మించారు. లెక్చరర్ గానూ, ప్రిన్సిపాల్ గానూ పనిచేశారు. ఆయన పర్యావరణవేత్తగానూ గుర్తింపు పొందారు. కాగా, జాతీయస్థాయిలో మొత్తం 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది.