పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు

  • బుధవారం కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడి
  • రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14గా ఉన్నట్లు వెల్లడి
  • కొత్త కేసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలిపిన వైద్య శాఖ
కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ సహా దేశీయంగా జేన్.1 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. వైద్య శాఖ వివరాల మేరకు... కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో 6 కొత్త కేసులు నమోదు కాగా, ఒకరు రికవరీ అయ్యారు. రికవరీ రేటు 99.51 శాతంగా ఉన్నదని వైద్య శాఖ వెల్లడించింది.


More Telugu News