బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడి అరెస్ట్
- బిగ్‌బాస్ విజేత టైటిల్ ప్రకటన రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం
- జరిగిన ఘర్షణలో ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్
- ప్రశాంత్‌ను, సోదరుడుని కొల్గూరులో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించిన పోలీసులు
బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతడి స్వగ్రామం కొల్గూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ విజేత టైటిల్ గెలుచుకున్న రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
బిగ్‌బాస్ ఫైనల్స్ సమయంలో ఆదివారం రాత్రి విజేత పల్లవి ప్రశాంత్‌కు స్వాగతం పలికేందుకు అతడి అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకు తరలివచ్చారు. అదే సమయంలో మరో కంటెస్టెంట్ అమర్‌దీప్ అభిమానులు అక్కడి చేరుకున్నారు. ప్రశాంత్‌కు అభిమానులు స్వాగతం పలుకుతున్న సమయంలో అమర్‌దీప్ కూడా బయటకు రావడంతో ఇద్దరి అభిమానుల మధ్యా వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో కొందరు.. అమర్‌దీప్, మరో కంటెస్టెంట్ అశ్విని కార్లపై రాళ్లు విసిరారు. కొందరు ఆర్టీసీ బస్సుల అద్దాలు, బందోబస్తుకు వచ్చిన పోలీసు బెటాలియన్ బస్సు అద్దాలనూ పగలగొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేలింది. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్, ఏ-2గా అతడి సోదరుడు మనోహర్, ఏ-3గా ప్రశాంత్ స్నేహితుడిని చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్ అతడి సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.