రోజువారీ ఖర్చులకూ డబ్బుల్లేవని చెప్పడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ఫైర్
- బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం సరికాదన్న అక్బరుద్దీన్
- రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు ఇలాంటివి చెప్పి తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దని సూచన
- రాష్ట్రాలలా కేంద్రం కూడా అప్పులు చేసిందన్న అక్బరుద్దీన్
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు అప్పులు పెరిగాయని, దివాలా తీసిందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పడంపై మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం ఏమాత్రం సరికాదన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు ఇలా చెప్పి తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దని సూచించారు. రాష్ట్రాలలా కేంద్రం కూడా అప్పులు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెప్పడం ద్వారా ప్రభుత్వం ఏం సందేశం ఇస్తోంది? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో అక్బరుద్దీన్ కర్ణాటక ప్రభుత్వం చేసిన అప్పులను సభలో తెలిపారు. అయితే ప్రజల్లోకి తప్పుడు సందేశాలు వెళ్లవద్దనే తాను ఇది చెప్పినట్లు వెల్లడించారు.