భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- చివరి రెండు గంటల్లో పతనమైన మార్కెట్లు
- 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 302 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 930 పాయింట్లు కోల్పోయి 70,506కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 21,150కి దిగజారింది. ఒకానొక సమయంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకాయి. అయితే చివరి 2 గంటల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీలు నష్టాలను చవిచూశాయి. టాటా స్టీల్ (-4.73%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.26%), టెక్ మహీంద్రా (-3.16%), టాటా మోటార్స్ (-3.13%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.