శ్వేతపత్రాన్ని ఏపీ రిటైర్డ్ అధికారితో తయారు చేయించారు: హరీశ్ రావు

  • గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక తయారు చేయించారన్న హరీశ్ రావు
  • కరోనా కారణంగా ఎక్కువ అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతించిందని వెల్లడి
  • కేంద్రం నుంచి నిధులు రానందువల్ల ఇబ్బంది కలిగిందని విమర్శ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్వేతపత్రంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని అన్నారు. చూపించిన లెక్కలన్నీ తప్పులేనని చెప్పారు. ఈ శ్వేతపత్రాన్ని ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని చెప్పారు. 

హరీశ్ రావు ప్రసంగంలోని హైలైట్స్:
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికను తయారు చేయించారు. 
అప్పులను రెవెన్యూతో పోల్చారు. అప్పులను జీఎస్డీపీతో పోల్చలేదు. 
కరోనా కారణంగా ఎక్కువ అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతించింది. 
కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పెరిగినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదు. 
లక్ష కోట్లు కేంద్రం నుంచి రానందువల్లే ఇబ్బంది కలిగింది. 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. లేకపోతే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. పెట్టుబడులు కూడా ఆగిపోతాయి. 
అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింద నుంచి ఐదో స్థానంలో తెలంగాణ ఉంది.


More Telugu News