ఎంపీల హేళన నేపథ్యంలో ఉప రాష్ట్రపతికి మోదీ ఫోన్
- 20 ఏళ్లుగా వాళ్ల అవమానాలను తాను భరిస్తున్నానంటూ ప్రధాని వ్యాఖ్య
- రాజ్యసభ చైర్మన్ ను పార్లమెంట్ లో అవమానించడం దురదృష్టకరమని వ్యాఖ్య
- ప్రధానితో సంభాషణను ట్విట్టర్ లో వెల్లడించిన ధన్ ఖడ్
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను అనుకరిస్తూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీ తీవ్ర దుమారం రేపింది. దీనిని బీజేపీ ఎంపీలతో పాటు ఇతర నేతలు కూడా తప్పుబట్టారు. సస్పెండ్ అయిన ఎంపీల ప్రవర్తన సరిగా లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనికి రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు వంతపాడడంపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి ధన్ ఖఢ్ ట్విట్టర్ లో స్పందించారు.
ఎంపీల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదని, చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని అనుకరిస్తూ హేళన చేయడం సిగ్గుచేటని ధన్ ఖడ్ విరుచుకుపడ్డారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని వెల్లడించారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేసిన దారుణ చర్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతిపక్ష నేతల అవహేళనలకు తాను కూడా 20 ఏళ్లుగా గురవుతున్నట్లు మోదీ చెప్పారన్నారు. అయితే, ఉపరాష్ట్రపతికి పార్లమెంట్ ఆవరణలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారని ధన్ ఖడ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.