'సర్కారు నౌకరి'.. ఆసక్తిని రేపుతున్న ట్రైలర్!

  • గాయని సునీత తనయుడు ఆకాశ్ 
  • 'సర్కారు నౌకరి'తో హీరోగా పరిచయం
  • హీరోయిన్ గా భావనకు ఇదే ఫస్టు మూవీ 
  • జనవరి 1వ తేదీన సినిమా విడుదల  

ఒకప్పుడు సీనియర్ హీరోల కుటుంబాల నుంచే వారసులుగా హీరోలు వచ్చేవారు. ఆ తరువాత దర్శక నిర్మాతల తనయులు కూడా హీరోలుగా పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఇతర విభాగాల నుంచి కూడా హీరోలు రావడం మొదలైంది. అలా గాయని సునీత తనయుడు ఆకాశ్ కూడా హీరోగా పరిచయమవుతున్నాడు.

ఆకాశ్ తొలి సినిమాగా 'సర్కారు నౌకరి' సినిమా రూపొందింది. రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మించారు. జనవరి 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శాండిల్య స్వరపరిచిన ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. శేఖర్.జి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గ్రామాల్లో నిరోధ్ వాడకం గురించిన అవగాహన కల్పించడం .. వాటిని వాళ్లకి అందుబాటులోకి తీసుకురావడం హీరో జాబ్. అది అతని భార్యకి ఇష్టం ఉండదు. దాంతో తానో .. ఉద్యోగమో తేల్చుకోమని అంటుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడనే ఆసక్తిని ట్రైలర్ రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో కథానాయికగా భావన పరిచయమవుతోంది.


More Telugu News