ఆ సినిమాతో నాన్న జీరోకి పడిపోయారు: 'ఆహుతి' ప్రసాద్ తనయుడు కార్తీక్
- 'ఆహుతి' ప్రసాద్ తనయుడు కార్తీక్
- తన తండ్రి 300 సినిమాలు చేశాడని వెల్లడి
- నిర్మాతగా చాలా నష్టపోయాడనే వ్యాఖ్య
- 'నిన్నే పెళ్లాడుతా' మళ్లీ లైఫ్ ఇచ్చిందని వివరణ
విలక్షణ నటుడిగా 'ఆహుతి' ప్రసాద్ ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఆ మధ్య ఆయన కేన్సర్ కారణంగా చనిపోయారు. ఆయన తనయుడు కార్తీక్ ప్రసాద్ మాట్లాడుతూ .. "నాన్నగారు నాగార్జున గారి 'విక్రమ్' సినిమాకి డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేశారు. ఆ తరువాతనే ఆయన 'ఆహుతి' సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారి వల్లనే 'ఆహుతి' సినిమాలో నాన్నగారికి ఛాన్స్ దొరికిందట. ఆ తరువాత నాన్నగారు 300 సినిమాల వరకూ చేస్తే, వాటిలో 80 నుంచి 90 వరకూ పోలీస్ పాత్రలే కనిపిస్తాయి. అందుకు కారణం 'ఆహుతి' లోని పాత్ర అనే చెప్పాలి. ఆ పాత్ర అంతగా ప్రభావం చూపించింది" అన్నారు.
"నాన్నగారు ఒక సినిమాను నిర్మించారు .. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన ఆయన జీరోకి వచ్చేశారు. అందువలన ఆర్థికపరమైన ఇబ్బందులు పడవలసి వచ్చింది. 'నిన్నే పెళ్లాడుతా' నుంచి తన ప్రయాణాన్ని మొదటి నుంచి ఆరంభించినట్టు అయింది. ఆ తరువాత ఇక ఆయన నిర్మాణం వైపు వెళ్లలేదు" అని చెప్పారు కార్తీక్.