టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఇదే: విజయసాయిరెడ్డి

  • టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందన్న విజయసాయిరెడ్డి
  • వైసీపీ ప్రభుత్వంలో అప్పులు 55 శాతానికి తగ్గాయని వెల్లడి
  • కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు టీడీపీ ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసిందని విమర్శ
టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు 55 శాతానికి తగ్గాయని తెలిపారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు టీడీపీ ప్రభుత్వం డబ్బును ఖర్చు చేసిందని విమర్శించారు. పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా, వారి కలలు సాకారమయ్యేలా ముఖ్యమంత్రి జగన్ డబ్బును వినియోగిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఇదేనని అన్నారు.


More Telugu News