దక్షిణాఫ్రికాతో రెండో వన్డే... స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే
- కెబెరాలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- 46.2 ఓవర్లలో 211 పరుగులు చేసిన టీమిండియా
కెబెరాలోని సెయింట్ జార్జెస్ పార్క్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటింగ్ కు అనుకూలించని పిచ్ పై టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులు చేసింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో యువ ఓపెనర్ సాయి సుదర్శన్ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 83 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 7 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56) అర్ధసెంచరీ సాధించాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో టీమిండియా భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4), తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (17), అక్షర్ పటేల్ (7) ఆశించన మేర రాణించలేదు. చివర్లో అర్షదీప్ సింగ్ 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 18 పరుగులు చేశాడు.
సఫారీ బౌలర్లలో నాండ్రే బర్గర్ 3, బ్యూరాన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, లిజాద్ విలియమ్స్ 1, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 1 వికెట్ తీశారు.